13-01-2026 11:10:13 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూతురు డాక్టర్ నాయిని గోదారెడ్డి బర్త్ డే సందర్భంగా మంగళవారం 60వ డివిజన్ వడ్డేపల్లి మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు ఆధ్వర్యంలో గోదారెడ్డిని కలిసి పూలబొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్, తెలంగాణ మత్స్యకార కార్యవర్గ సభ్యులు మండల సమ్మయ్య, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మెరుగు శివ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.