calender_icon.png 14 January, 2026 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే పేదల సొంతింటి కల సాకారం

13-01-2026 11:16:17 PM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం

కోట్ల రూపాయలతో పట్టణంలో శరవేగంగా అభివృద్ధి పనులు.

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం అవుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం రాత్రి సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 6,7,8,9 వార్డుల్లో అర్హులైన లబ్ధిదారులకు  ఇందిరమ్మ ఇండ్ల నూతన నిర్మాణాలకు మండలంలోని స్థానిక నాయకులతో కలిసి శనివారం భూమి పూజ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ నగర్ లోని విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో సొంతిల్లు లేని పేద ప్రజలు అనేక మంది ఉన్నారని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఇంటి ఓనర్లను చేస్తామని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పేరిట పేదలను మోసం చేసిందని గుర్తు చేశారు. బిఆర్ఎస్ పార్టీ పేదలకు ఒక్క ఇళ్లు కూడా అందించిన పాపాన పోలేదని, ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, నిరుపేదలకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందని తెలిపారు. పట్టణాన్ని కోట్లాది రూపాయలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. గతంలో నిర్వీర్యం అయిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయంలో ముందుకు సాగుతున్నాయని, గత ప్రభుత్వం సుల్తానాబాద్ పట్టణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఈ మండలంలో ఉన్న కార్యాలయాలను అన్నింటిని తరలించుకుపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వమేనని అన్నారు. నూతన బస్సు డిపో, బైపాస్ రోడ్డు, ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.

అంబేద్కర్ చౌరస్తా నుండి మసీదు నుండి గట్టేపల్లి చౌరస్తా వరకు డబుల్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని,రానున్న రోజుల్లో రహదారులను అభివృద్ధి పరుస్తూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్ని వార్డులలో అనేక రకాల అభివృద్ధి పనులు చేస్తున్నామని, దాదాపు 90% పనులు మార్కండేయ కాలనీ, 9వ వార్డులలో పూర్తి చేసామని తెలిపారు. 8.5 కోట్ల రూపాయలతో సుల్తానాబాద్ చెరువు ను, సుల్తానాబాద్ ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.గతంలో ఎన్నడూ లేని విధంగా సుల్తానాబాద్ మున్సిపల్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీ గిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సాయిరి మహేందర్, గాజుల రాజమల్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక సతీష్, పట్టణ అధ్యక్షులు వేగోళం అబ్బయ్య గౌడ్, బిరుదు కృష్ణ,దుగ్యాల సంతోష్ రావు,పన్నాల రాములు, ఊట్ల వరప్రసాద్,వర ప్రదీప్, అమిరిశెట్టి రాజలింగం, గరిగే శ్రీనివాస్ , తిరుపతి,ముత్యాల రవీందర్, కందునూరి ప్రకాష్ రావు,టీకే ప్రభాకర్, ఉస్తేం గణేష్,మూల సత్యం గౌడ్, దున్నపోతుల రాజయ్య, మమ్మద్ రఫీక్, ఫరూక్,సిద్ధ తిరుపతి, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్,హౌసింగ్ డిఇ, ఏఈ, నవ్య తోపాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు.