ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కమ్యూనిస్ట్ సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే(Former Ibrahimpatnam MLA) కొండిగారి రాములు కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో మాజీ ఎమ్మెల్యే రాములు తుదిశ్వాసవిడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
కొండిగారి రాములు 1989, 1994 జరిగిన ఎన్నికల్లో సీపీఎం పార్టీ తరుఫున రెండు సార్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా( Ibrahimpatnam MLA) పనిచేశారు. రాములు అసెంబ్లీలో ప్రజల సమస్యలపై ద్వజమెత్తిన నేతగా మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాములు కొడుకు కొండిగారి త్రిలోక్ కుమార్ మున్సిపల్ కౌల్సలర్ గా కొనసాగుతున్నారు. నిఖార్సైన ప్రజానేత మృతి పట్ల పలువురు ప్రముఖులు, ఇబ్రహీంపట్నం ప్రజలు సంతాపం తెలిపారు.




