08-02-2026 01:54:29 AM
మిషన్ కాకతీయ ఖర్చు రూ.5 వేల కోట్లు
55 వేల కోట్లు అవినీతి ఎలా జరుగుతుంది?
బీజేపీ జీఎస్టీ పెంచడం తప్పా ఏమీ చేయలేదు..
గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్, ఫిబ్రవరి 7: సీఎం రేవంత్‌రెడ్డివి, బీజేపీవి అన్ని అబద్ధాలేనని, బీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం గజ్వే ల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డిలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నయా పైసా పని కూడా చేయలేదన్నారు. రెండేళ్లలో గజ్వేల్ రోడ్డుకు గుంతలుపడితే కాంగ్రెస్ వాళ్లకు పూడ్చే సోయి లేదన్నారు.
గజ్వేల్‌ను అభివృద్ధి చేసింది కేసీఆరేనని, కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. మిషన్ కాకతీయ ఖర్చు రూ.5వేల కోట్లే అయి నా ఓ బీజేపీ ఎంపీ రూ.50 వేల కోట్లు తిన్నారని అనడం అవివేకమన్నారు. కేసీఆర్ వచ్చాక గజ్వేల్‌లో భూముల ధరలు కోట్లకు పెరిగితే రేవంత్ రెడ్డి వచ్చాక బంగారం ధర పెరిగి భూ ముల ధరలు పడిపోయాయన్నారు.
కేసీఆర్ కట్టిన భవనాలకు రేవంత్‌రెడ్డి రిబ్బన్ కట్ చేస్తూ కేసీఆర్ ఇచ్చిన పథకాలను ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ వాళ్లు పాల ధర లు, జీఎస్టీ పెంచుడు తప్పా చేసిందేమీ లేదన్నారు. కానీ ఎన్నికల్లో పైసలు బాగా పంచు తారని ఆరోపించారు. ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా, కాళ్లు మొక్కినా బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.