ఏపీ సీఎంకు నీతి.. మన సీఎంకు జాతి లేదు
- ప్రాజెక్టుల్లో 200 టీఎంసీల నీళ్లు మనవే
- సాగర్ ఆయకట్టు రైతులంతా వరి సాగు చేయండి
- నీళ్ల కోసం పేగులు తెగేదాకా కొట్లాడుతాం
- మంత్రి కోమటిరెడ్డికి వాటర్, నీళ్లు, క్వార్టర్ తప్ప ఏమీ తెలవదు
- మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): నీళ్ల పంపకాల విషయంలో ఏపీ సీఎ ంకు నీతి లేదు, తెలంగాణ సీఎంకు జాతి లేదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి(Former Minister Jagadish Reddy) విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తాగు, సాగునీరుకి సంబంధించిన మన నీళ్లు 200 టీఎ ంసీలు ఉన్నాయని, సాగర్ ఆయకట్టు కింద రైతులు పూర్తి స్థాయిలో నాట్లు వేయాలని, నీళ్ల కోసం పేగులు తెగేదాకా కొట్లాడుతామని అన్నారు.
ఆదివారం నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ట్రైన్ రన్ పే రిట వెలిగొండ ప్రాజెక్టుకు ఏపీ సీఎం నీళ్లు తీసుకెళ్తున్నాడని, మన సీఎం మౌనం వహించాడన్నారు. అనైతికంగా నీళ్లు తీసుకుపోతుంటే ప్రభుత్వ నుంచి ఒక లేఖ రాయలేదన్నారు.
ఏపీ సీఎంకు నీతి లేదని, తెలంగాణ సీఎం కు జాతి లేదని విమర్శించా రు. సాగర్ ఎడమ కాల్వ, వరద కాల్వ, ఏఎంఆర్పీ, లో లెవల్ కింద మొత్తం ఆయకట్టుకు నీ ళ్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో 200 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, అవి తెలంగాణ రైతుల హక్కు అని అన్నారు. నీటి విడుదల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని, ఎడమ కాల్వకు ఎప్పటివరకు నీరిస్తారో స్పష్టం చేయాలన్నారు.
నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించకపోతే కేటీఆర్ పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రా నీటి దోపిడీపై రాష్ట్రం ఇప్పటివరకు కృష్ణా బోర్డుకు ఒక్క లేఖ కూడా రాయలేదని.. పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా చంద్రబాబు 200 టీఎంసీలను దోచుకుపోతున్నారని, దీనిపై కేఆర్ఎంబీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. నీటిని దోచుకునేందుకే పోతిరెడ్డి పాడు గేటుకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు గేటు ఊడిపోతే 48 గంటల్లో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
సీఎం, మంత్రులకు సోయి లేదు
భూ భారతి పేరుతో కోటి ఎకరాలను 22ఏలో పెట్టి దోచుకునే పనిలో సీఎం, మం త్రులు బిజీగా ఉన్నారని ఆరోపించారు. వ్యవసాయం సర్వనాశనం అయిందని, తమ హ యాంలో ఉదయ సముద్రం కళకళలాడిందని, ఇప్పుడు పడావు పడిందన్నారు. మంత్రి కోమటిరెడ్డికి సాగునీళ్లు ఇప్పించాలని సోయిలేదని.. వాటర్, నీళ్లు, కోటర్ అంటాడని ఎద్దేవా చేశా రు. తాము అధికారంలో ఉన్నపుపడు దేశంలో కరెంటు సంక్షోభం వచ్చినా తెలంగాణ రాష్ర్టం లో ఒక్క నిమిషం కరెంటు పోనివ్వలేదన్నారు.
సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే రైతులు కరెంటు కోసం ధర్నా చేశారని ఇంతకన్నా సా క్ష్యం ఇంకేమి కావాలని ప్రశ్నించారు. కమీషన్లు రావని కరెంటు ఉత్పత్తిని తగ్గించాలని ఫలితంగానే కరెంటు సమస్య ఏర్పడిందని విమర్శిం చారు. సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రేగటి మల్లికార్జున్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, మారగోని గణేష్ గౌడ్, దొడ్డి రమేష్, జంగయ్య యాదవ్, పేర్ల యాద య్య, జమాల్ ఖాద్రి, జనార్దన్‌గౌడ్, నాగార్జున, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.