హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఆత్మగౌరవం.. తెలంగాణ తల్లి విగ్రహం అని, సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దని చాలా మంది మేథావులు చెప్పారన్నారు.