హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు సహయ నిధీకి ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. తన తరుపున రూ.50 లక్షలు, కుమారుడు రాం చరణ్ తరుపున రూ.50 లక్షల చెక్కులను సీఎంకు అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. అమరరాజా గ్రూప్ సంస్థ తరపున సీఎం సహయనిధికి మాజీ మంత్రి అరుణ కుమారి రూ.కోటి, మెగా హీరో సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, కమిడియన్ అలీ రూ.3 లక్షలు, హీరో విశ్వక్ సేన్ రూ.10 లక్షలు విరాళం అందించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం సీఎంను కలిసిన చెక్కులను అందజేశారు.