మాజీ ఎమ్మెల్యే ఆనంద్ హౌస్ అరెస్ట్
వికారాబాద్, సెప్టెంబర్ -8: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ను (Former MLA Dr. Methuku Anand) పోలీసులు మంగళవారం ఉదయమే హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నా రని, బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు బి ఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అయితే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ లో కూడా కాంగ్రెస్ భారీ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో సీఐ రఘు కుమార్ ఆధ్వర్యంలో ఉదయం నుండి టిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
రేవంత్ పాలన నిరక్షంగా ఉంది..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన నిరంకుశంగా సాగుతుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. కనీసం నిరసన తెలిపే హక్కులను కూడా సీఎం కాలరాస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలను జుట్టు పట్టుకొని, పైట కొంగులు పట్టుకొని లాగడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే హోమ్ మినిస్టర్ ఉందని ఆయన ఆదేశం మేరకే పోలీసులు ఇలా ప్రవర్తించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీని, నాయకులను కాంగ్రెస్ ఎంత అణగదొక్కాలని చూస్తే అంత బలంగా పైకి లేస్తుందని తెలిపారు.