17 April, 2026 | 3:37 PM

Breaking News

జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •  

ఘనంగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు జన్మదిన వేడుకలు

09-04-2025 08:31 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పినపాక మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని గల ప్రభుత్వం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నందు కేక్ కటింగ్ చేసి కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి సీతారాములా వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అష్టైశ్వర్యాలుకలగా చేయాలని భవిష్యత్తులో ఉన్నత పదవులు అవరోధించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొనకంచి శ్రీను,గోనెల నాని, సానికొమ్ము శంకర్ రెడ్డి, బొల్లు సాంబ, రవికుమార్, కనకాచారి, పూర్ణ, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.