26 May, 2026 | 4:41 PM

కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి

26-05-2026 04:10 PM

25 వేల ఆర్థిక సాయం

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని లింగాలపల్లి గ్రామానికి చెందిన సోయం లాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఖమ్మం పట్టణంలోని యలమద్ది ప్రైవేట్ హాస్పిటల్‌లో కోమాలో చికిత్స పొందుతుండగా, మంగళవారం బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు పరామర్శించి 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. యలమద్ది హాస్పిటల్‌లోని ఐసియులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సోయం లాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లాలు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం నింపారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో చాప చల్మారావు తదితరులు పాల్గొన్నారు.