వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి
26-05-2026 04:11 PM
ఉట్నూర్, మే 26( విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామం వద్ద గల త్రివేణి సంఘ ప్రాజెక్టు పనులు వర్షాకాలం ప్రారంభంలోగా పూర్తిచేయాలని నేటిపారుదల శాఖ ఈ ఈ విట్టల్ అన్నారు. మంగళవారం రూపాలు 26 లక్షలతో చేపట్టిన మరమ్మతుపరులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వర్షాకాలం భారీ వర్షాలకు త్రివేణి సంగమం మత్తడి పైనుండి వరద నీరు ప్రవహించడంతో ఆర్ అండ్ బి రోడ్డు కూతకు గురైందని గుర్తు చేశారు. ఈసారి వర్షాకాలంలో మత్తడి పై ప్రవహించే నీరు ఆర్ అండ్ బీ రోడ్డు కూతురు గురికాకుండా వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఏఈ ప్రవీణ్ కుమార్ ను ఆదేశించారు. ఆర్ అండ్ బి రోడ్డు కోత గురి అయితే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు.






