బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన పులికుచ్చ తండా మాజీ సర్పంచ్
15-09-2026 | 05:28pm
బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలంలోని పులికుచ్చ తండా(Pulikutcha Thanda)కు చెందిన మాజీ సర్పంచ్ పీర్ సింగ్ తో సహా పదిమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు మంగళవారం పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(Former MLA Bajireddy Govardhan) సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరికి బాజిరెడ్డి గోవర్ధన్ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తండాలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని మాజీ సర్పంచ్ పీర్ సింగ్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిలో రాహుల్, భాను కిరణ్, ఆది కేశవ్, మోహన్, విజయ్ తో పాటు పలువురు కార్యకర్తలు పార్టీలోకి చేరారు.