27 July, 2026 | 7:55 PM

Breaking News

విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోండి   •   తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •  

రోహిణి కార్తె వచ్చిన ధాన్యం అమ్ముడు పోక రోడ్డుపైనే రైతు విలవిల

28-05-2026 03:19 PM

ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వానికి రైతు ఉసురు తాకుతుంది 

కాల్వ శ్రీరాంపూర్ లో మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం

కాల్వ శ్రీరాంపూర్ మే 28(విజయక్రాంతి): రోని కార్తి వచ్చిన ధాన్యం అమ్ముడు పోక కల్లల్లోనే రైతు విలవిలాడుతున్నాడని, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వానికి రైతు ఉసురు తాగుతుందని, కాల్వ శ్రీరాంపూర్ లో మాజీ జెడ్పిటిసి వంగల  తిరుపతి రెడ్డి గురువారం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మార్కెట్ల లో 30 శాతం దాన్యం నిలువలు పేరుకుపోయి ఉన్నాయని ఆయన అన్నారు. రోని కార్తీ లో రైతులు దుక్కులు దున్ని, నారుమల్లు పోసే సమయం వచ్చినా గాని, ఇప్పటివరకు  కూడా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఇప్పటి వరకు నారుమల్లలో ఉండాల్సిన రైతు, కల్లాలో గత పంటను పట్టుకొని  ఎప్పుడు అమ్ముడు పోతుందా...అని పడి గాపులు కాస్తున్నాడని, ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాన్ని విమర్శించే కాంగ్రెస్ నాయకులు కల్లాల్లో రైతుల కష్టాలు కనిపిస్త లేవా అని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు రైతులకు చేసింది శూన్యమని అన్నారు. సకాలంలో రైతుబంధు వెయ్యకపోవడంతో పెట్టుబడి సాయం లేక రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు.  వ్యక్తిగత విమర్శలు పక్కనపెట్టి రైతు కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని తిరుపతిరెడ్డి హెచ్చరించారు.