27 July, 2026 | 6:57 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

28-05-2026 03:20 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణంలోని ఈద్గా వద్ద గురువారం  డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇంచార్జ్ శ్యాం నాయక్,మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ ఇరుకుల మంగ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగం, సహనం, దైవభక్తికి ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తుందని అన్నారు.

ప్రజలు సుఖసంతోషాలతోజీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రార్థనలకు హాజరైన ముస్లిం పెద్దలు, యువకులను ఆప్యాయంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు తరిఖ్, భీమ్‌రావ్, ప్రధాన కార్యదర్శి గాదేవేణి మల్లేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా భాయ్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, కాంగ్రెస్ నాయకులు శైలెందర్, డోంగ్రే ప్రవీణ్ కుమార్, మహమ్మద్ షఫి, ఇమ్రాన్, హరికృష్ణ, ఇల్లూరి రాము, బాలు, గేడం శ్రీధర్, మహమ్మద్ తాజ్, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.