ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
16-09-2026 | 09:30pm
మునిపల్లి(విజయక్రాంతి): మండలంలోని మగ్దుంపల్లి గ్రామానికి(Magdumpalli village) చెందిన యేసయ్య అనే లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి(construction of Indiramma Houses) కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు, నాయకులు ఫిరోజ్ ఖాన్, వీరేశం, ఈశ్వరయ్య, వీరన్న, చాంద్ పాషా పటేల్ తదితరులు పాల్గొన్నారు.