5 August, 2026 | 6:06 PM

వామ్మో ...ఛీ,, ఏమీ.. కేజీబీవీ పాఠశాల

05-08-2026 05:01 PM

ఎమ్మెల్యే మందుల సామేలు సిబ్బందిపై ఆగ్రహం.

పాఠశాలలో పనిచేయని స్వీపర్లు.. అవసరమా?

తుంగతుర్తి (విజయ క్రాంతి): వామ్మో .. చీ.. ఏమి కేజీబీవీ పాఠశాల, గిట్ల ఉంది, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.  సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల అభివృద్ధిలో భాగంగా, సుమారు 36 లక్షల అభివృద్ధి పనులగాను, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు బుధవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల పరిశుభ్రంగా లేదని, ఏకంగా వామ్మో..చ్చి.. గిట్ల ఉంది ఏందని, సంబంధిత పాఠశాల ఎస్ఓ, సిబ్బంది నిలదీశారు. ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటున్నారా, లేదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు కావలసిన రీడింగ్ రూము, ఇంటర్ విద్యార్థులకు అదనపు గదులకు ప్రత్యేకంగా టెండర్ ప్రక్రియలు రీ ఎస్టిమేషన్ వేసి, తిరిగి టెండర్ ప్రక్రియ కొనసాగించాలని, సంబంధిత జిల్లా అధికారి డీఈవో దృష్టికి ఫోన్లో తీసుకువెళ్లారు. పాఠశాల మొత్తం కలియ తిరుగుతూ, స్టోర్ రూమ్ లో పరిశీలిస్తూ, వంటశాలలో పరిశీలించారు.

అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, మొదట ఎంఈఓ లింగయ్య తో మాట్లాడుతూ, మీరు పర్యవేక్షణ చేస్తున్నారా లేదా అని, గిట్ల ఎందుకు ఉంటది, అని ప్రశ్నించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడుతూ మన ఇంటిలో ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో, అదే రీతిలో పాఠశాలను చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, హితవు పలికారు. విద్యార్థులతో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇరువురు స్వీపర్లు గతంలో పాఠశాలలో సమస్యలు తలెత్తడానికి కారకులు అయ్యారు.

ఏకంగా కలెక్టర్ సస్పెండ్ చేయగా, మళ్లీ రాజకీయాల ఒత్తిడితో, వారే రావడం, సరిగా సమయపాలన, పాటించకుండా పనిచేయకపోవడంతో, మరొకసారి సమస్యలు వచ్చినట్లు పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా డీఈవోలు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, పాఠశాల అపరిశుభ్రముగా, పనిచేయకుండా పోయి, సమయపాలన పాటించని, విద్యార్థులను బెదిరిస్తున్న వారిపై, చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.