14 August, 2026 | 3:51 PM

Breaking News

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ, రోడ్డు సౌకర్యం కల్పించాలి   •   సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి   •   హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో సత్యాగ్రహ దీక్ష   •   గీత దాటితే సీఎంతో సహా అందరూ ఒకటే: రాజగోపాల్‌పై పీసీసీ చీఫ్‌ ఆగ్రహం   •   రామాలయంలో ప్రారంభమైన లలిత సహస్రనామాల పారాయణం.   •   నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును కాపాడాలి: చాడ వెంకటరెడ్డి   •   ఈనెల 16న జయశంకర్ జిల్లా క్రికెట్ క్రీడాకారుల సమావేశం   •   సెప్టెంబర్ మొదటివారంలో పనులు మొదలు కావాల్సిందే   •   జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్ కీలక ప్రకటన   •   వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి జిల్లా పోలీసులు   •  

తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి

04-05-2026 12:13 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం సమీపంలోని ఊరందురు జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ఒక లారీని అంబులెన్స్ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కోల్‌కతాకు చెందిన ఒక రోగిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచిన ఒక లారీని, అంబులెన్స్ వెనుక నుండి ఢీకొట్టింది. అంబులెన్స్‌లో డ్రైవర్‌తో కలిపి మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.