4 May, 2026 | 1:18 PM

కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత

04-05-2026 12:01 PM

హైదరాబాద్‌: వివాహేతర సంబంధాలు ఎన్నో ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని చింతల్ అంబేద్కర్ నగర్ వద్ద ఒక వివాహిత మహిళ తన కుమారుడి సహాయంతో తన ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన 40 ఏళ్ల శివారెడ్డి, గత పదేళ్లుగా సదరు మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళ కుమారుడు (19 ఏళ్లు)  అతను కూడా వాళ్తతోనే నివసిస్తున్నాడు.

గత కొన్ని నెలలుగా శివారెడ్డి వారిద్దరినీ వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఆ మహిళ, ఆమె కుమారుడు శివారెడ్డిని నరికి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక గోనెసంచిలో మూటగట్టి, దానిని తరలించడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను, ఆమె కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.