23 May, 2026 | 12:55 AM

పులి పంజాకు నలుగురి బలి

23-05-2026 12:00 AM
  1. బీడీ ఆకుల కోసం అడవికి వెళ్లగా దాడి
  2. మృతుల్లో అందరూ మహిళలే..
  3. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఘటన 

ముంబై/ఆదిలాబాద్, మే 22: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో అడవిలోకి బీడీ ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన మహిళా కూలీలపై పులి హఠాత్తుగా దాడి చేసింది. దీంతో నలుగురు మహిళలు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొందరు మహిళలు భయపడి కేకలు వేస్తూ పరుగెత్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాం తంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

ఇప్పటికే పలు చోట్ల దాడుల ఘట నలు చోటుచేసుకోగా, తాజా ఘటన సిందేవహి తాలూకాలోని గ్రామీణ ప్రాంతాల ప్ర జలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నా రు. ప్రతి వేసవిలో చంద్రపూర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలు ఎండిపోయిన బీడీ ఆకులు(తెండు ఆకులు) ఏరుకొనేందుకు వెళు తుంటారు. శుక్రవారం ఉదయం కూడా కొం దరు మహిళలు అడవికి వెళ్లారు. అందరూ పనిలో నిమగ్నమై ఉండగా, పులి మాటువేసి వారిపై దాడిచేసింది.

వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అది భయంకరంగా విరు చుకుపడింది. దీంతో ఘటనా స్థలంలోనే నలుగురి మహిలా కూలీలు కవాదుబాయి దాదాజీ మోహర్లే (45) అనుబాయి దాదాజీ మోహర్లే (46), సంగీతా సంతోష్ చౌదరి (36), సునీతా కౌశిక్ మోహర్లే (33) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతావారు భయపడి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, కేకలు వేస్తూ.. పరుగెత్తి ప్రాణాలను కా పాడుకున్నారు.

ఈ ఘటన తరువాత చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందో ళనలకు గురవుతున్నారు. ఫారెస్ట్ రేంజి అధికారులకు సమాచారం అందిన వెంటనే చంద్రపూర్ సర్కిల్ ఆర్‌ఎం రామానుజన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరా లు అందజేస్తామన్నారు. మరోవైపు, అటవీశాఖాధికారుల అలసత్వంపై గ్రామీణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తునారు.