నీట్ లీక్ కేసులో మరొకరి అరెస్ట్
- పుణె లెక్చరర్ మనీషా సంజయ్ హవల్దార్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ
- భౌతికశాస్త్ర ప్రశ్నల లీకేజీలో ఈమే కీలకం
- ఈ కేసులో 11కు చేరిన అరెస్టుల సంఖ్య
న్యూఢిల్లీ, మే 22: నీట్ లీక్ కేసులో పుణె కు చెందిన ఓ లెక్చరర్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం పుణెలోని ‘సేథ్ హీరాలాల్ సరఫ్ ప్రశాల’లో పనిచేస్తున్న మనీషా సంజయ్ హవల్దార్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. పిజిక్స్ పేపర్ లీక్ వ్యవ హారంలో ఆమె మరొక కీలక నిందితురాలని సీబీఐ పేర్కొంది. నీట్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో ఈమె 11వ నిందితురాలు కావడం గమనార్హం.
నీట్ ఫిజిక్స్ ప్రశ్నల లీకు వ్యవహారంలో మరొక కీలక నిం దితురాలిని అరెస్ట్ చేసిందని సీబీఐ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా నిపుణురాలిగా నియమితులైన తర్వాత, మనీషా సంజయ్ నీట్ ప్రక్రియలో పాలుపంచుకున్నారని వెల్లడించారు. ‘ఆమెకు ఫిజిక్స్ ప్రశ్నాపత్రంపై పూర్తి స్థాయి యాక్సెస్ ఉండేదని, ఏప్రిల్ నెలలో, ఆమె ఆ ప్రశ్నలలో కొన్నింటిని సహ-నిందితురాలైన మనీషా మంధారేతో పంచు కున్నారని పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీక్ సం బంధించి, పుణెకు చెందిన వృక్షశాస్త్ర ఉపాధ్యాయురాలైన మంధారేను సీబీఐ మే 16న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీషా సంజయ్ హవల్దార్ అభ్యర్థులతో పంచుకున్న ప్రశ్నలు, ఫిజిక్స్ పేపర్‌లోని ప్రశ్న లతో సరిపోలాయని సీబీఐ తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు 11 మంది అరెస్టయ్యారు.






