20 May, 2026 | 7:54 PM

మొక్కజొన్న తూకంలో మోసం... రైతుల ఆగ్రహం

20-05-2026 06:49 PM

సొసైటీ కార్యాలయం ఎదుట రైతుల రాస్తారోకో

క్వి.3 నుండి 4 కిలోల తూకం ఎక్కువ చేస్తున్నారని రైతుల ఆరోపణ

సొసైటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్

బాన్సువాడ ఆర్డిఓ హామీతో రైతుల ఆందోళన విరమణ

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలోనీ సొసైటీ కార్యాలయంలో రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రంలో సొసైటీ సిబ్బంది తూకంలో మోసం చేస్తున్నారని రైతులు సొసైటీ కార్యాలయం ఎదుట బుధవారం రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. సొసైటీ సిబ్బంది మొక్కజొన్న తూకంలో క్వింటాల్ కు 3 నుండి 4 కిలోలు తూకంలో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో రైతులు ఫోన్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చెయ్యగా బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు.సొసైటీ కి చెందిన కాంటకు ప్రైవేట్ కాంటకు కిలోనర 1.5 నుండి రెండు 2 కిలోల వ్యత్యాసం కనిపించిందనీ కిలోనర నుండి రెండు కిలోలు ఎక్కువ  జోకినట్లు ప్రాథమికంగా తేలిందని తూకం తనిఖీ అధికారులను పిలిచి నిర్ధారణ చేసి సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని ఆర్డిఒ రవీందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకూడదని సొసైటీ సిబ్బందికి హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో లో నాయకులు రైతులు సంగ్రామ్ నాయక్, బోనాల సాయిలు, ప్రవీణ్ గౌడ్  తదితర రైతులు పాల్గొన్నారు.