అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ ఆసుపత్రిలో ఉచిత ఈఎన్ టి సర్జరీ మెగా ఆరోగ్య శిబిరం
అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ ఆసుపత్రిలో ఉచిత ఈఎన్టి సర్జరీ మెగా ఆరోగ్య శిబిరం
15 నుండి 19 వరకు 5 రోజులపాటు నిర్వహణ
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 15 ( విజయక్రాంతి ) : అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్(Reach NSR) ఆసుపత్రి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15వ తేది నుండి 19వ తేదీ వరకు 5 రోజులపాటు ప్రత్యేక ఉచిత ఈ ఎన్ టి సర్జరీ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిబిరంలో ప్రముఖ ఈ ఎన్ టి సర్జన్ డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ ఎంబీబీఎస్, ఎంఎస్ వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.
అందులో భాగముగా చెవిలో నొప్పి, వినికిడి తగ్గడం, తరచుగా జలుబు, ముక్కు బ్లాక్ అవ్వడం, గొంతు నొప్పి, మింగేటప్పుడు ఇబ్బంది అవడం, తలనొప్పి, సైనసైటిస్, చెవిలో మోగుడు శబ్దం, ముక్కు నుంచి రక్తస్రావం వంటి సమస్యలకు చూసి చికిత్స ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా ఉచిత ఓపి, ఎండోస్కోపి, వినికిడి, థైరాయిడ్, రక్త పరీక్షలపై 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిబిరం సెప్టెంబర్ 15 నుండి19వరకు రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ ఆసుపత్రి, కొత్తపేట క్రాస్ రోడ్, ఆరెపల్లి, వరంగల్ లో నిర్వహించబడుతుందని ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 94598 75555 నెంబర్ లో సంప్రదించాలని వారు తెలిపారు