ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మండల విస్తరణ అధికారి రవిదాస్
వాంకిడి(విజయక్రాంతి): ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వాంకిడి మండల పీహెచ్సీ ఆరోగ్యవిస్తరణ అధికారి రవి దాస్ అన్నారు. శుక్రవారం వాంకిడి మండలం సవాతి గ్రామంలో పిహెచ్సీ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యం లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రవాసాల ప్రాముఖ్యత, క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి మాట్లాడుతూ... రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వడదె బ్బ తగల కుండా ప్రజలు తీసు కోవాల్సిన చర్యల గురించి వివరించారు. వైద్యశిబిరం నిర్వహించి 45మందిని మందిని పరీక్షించి అవసరమైన 29మందికి మందులు పంపిణి చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో మండల ఆరోగ్యవిస్తరణ రవిదాస్ పెందోర్, డాక్టర్ రియాజ్, ఏఎన్ఎం గోదు బాయి సవాతి గ్రామ సర్పంచ్ సోయం చంపబాయ్,మాజీ సర్పంచ్ సోయం భీంరావ్,సెక్రెటరీ మల్లేష్, ఆశాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




