3 August, 2026 | 2:36 AM

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

03-08-2026 01:24 AM

బెజ్జూర్ ఆగస్టు 2 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో ని గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళ విభాగం ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రాచకొండ నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ ఆదర్శ్ తెలిపారు.

ఇట్టి వైద్య శిబిరానికి ఏఐసీసీ మహిళా విభాగ కార్యదర్శి అధిత శిబిరాన్ని సందర్శించారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా మారుమూల ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 274 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

మునుముందు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్యవైశ్య సంఘం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర సర్తాజ్ పాషా, సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి,జిల్లా అధ్యక్షురాలు పూజ, అధ్యక్షురాలు భవాని, ప్రధాన కార్యదర్శి సామ్రాజ్యలక్ష్మి, కోశాధికారి శ్రీదేవి, అదనపు కార్యదర్శి శ్రీదేవి, మాదంశెట్టి జయలక్ష్మి, సాధన, శారద, నీలిమ, సారిక, తుడూరు సాయిష్మా, డాక్టర్ అంకిత్, శoతను, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాచకొండ శ్రీ వర్ధన్, కాంగ్రెస్ నాయకులు హకీమ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.