3 August, 2026 | 3:59 AM

‘పట్నం’ కుటుంబానికి పరామర్శ

03-08-2026 02:26 AM

రుక్కమ్మ చిత్రపటానికి సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ 

కేటీఆర్ వేర్వేరుగా నివాళులు 

మొయినాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): మొయినాబాద్‌లో ఆదివారం నిర్వహించిన పట్నం మహేందర్‌రెడ్డి తల్లి పట్నం రుక్కమ్మ దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. రుక్కమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పట్నం మహేందర్‌రెడ్డి, పట్నం సునీతమ్మ దంపతులను, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డిలను పరామర్శించారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మధుసూదన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గండి విట్టల్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం నివాళులర్పించారు.