గోడ దూకి విద్యార్థుల పరార్!
03-08-2026 02:24 AM
సర్వేలు గురుకులం నుంచి పారిపోయిన ఇద్దరు
సంస్థాన్ నారాయణపూర్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో అత్యుత్తమ విద్యను అందించే గురుకులంగా పేరుగాంచిన సర్వేలు గురుకులంలో విద్యార్థులకు భద్రత కరువైందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఈ.నవదీప్, అభినయ్ అనే విద్యార్థులు ఆదివారం తెల్లవారుజామున గోడ దూకి పారిపోయారని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి నారాయణపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంస్థాన్ నారాయణపురం మండలం కోతులాపురం గ్రామానికి చెందిన విద్యార్థి నవదీప్‌తో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అభినయ్ ఉన్నట్టు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సీతపాండు తెలిపారు.






