24 April, 2026 | 7:42 PM

ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం

24-04-2026 06:04 PM

దోమ పుట్టకుండా... దోమ కుట్టకుండా

కీసర డివిజన్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

కీసర డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత

జవహర్ నగర్,(విజయక్రాంతి): మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.. మన ప్రాంతాలలో ఉన్న  దోమలను అరికట్టవచ్చునని, ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గమని, కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కీసర సర్కిల్, కీసర డివిజన్లోని హనుమాన్ నగర్ రామాలయం కమ్యూనిటీ హాల్లో దోమ కాటు వ్యాధులపై, దోమల నివారణ పై అవగాహన (ఫ్రైడే_ ఫ్రైడే) కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కీసర డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత హాజరై మాట్లాడుతూ దోమ కాటు వ్యాధులపై అవగాహనతో పాటు ప్రత్యక్ష అనుభవ పద్ధతి ద్వారా దోమలను నివారించవచ్చును తెలిపారు. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత అని మలేరియా డెంగ్యూ వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు మీ ఇల్లు ఇంటి పరసరాలలో ఉండే నీటి నిల్వలలో ఒక దోమ తన జీవితకాలం 30 రోజులలో సుమారు 1000 గుడ్ల చొప్పున పెట్టి సంవత్సరానికి సుమారు 700 కోట్ల దోమలను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. కావున వారాని ఒకసారి నీటి నిల్వలను తొలగించి దోమలను వాటి లార్వాలను నిర్మూలిద్దామని తెలిపారు.

మన పరిసరాలను మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవరణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. దోమల నివారణకు పరిసర ప్రాంతాలను సాధ్యమైనంతవరకు పరిశుభ్రంగా ఉంచుతూ మురిగినీటినీ నిల్వ ఉంచకుండా ప్రత్యేక రసాయనాలతో పిచికారి చేసి దోమలను నివారించాలన్నారు. అలాగే దోమల నివారణకు దోమతెరలు వంటి సాధనాలు ఉపయోగించి దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని, మున్సిపల్ పరిధిలో శుభ్రత పరిశుభ్రత నియమాలు పాటించి ప్రజలు స్వచ్ఛంద అవగాహనతో ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా సాగుతుందన్నారు.