17 August, 2026 | 12:29 PM

బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం

17-08-2026 11:58 AM

పాట్నా: బాంకీపూర్, బీహార్‌లకు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor takes oath) సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకీపూర్ ఎమ్మెల్యేగా( Bankipur MLA) ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 3న జరిగిన బీహార్‌లోని ప్రతిష్టాత్మక బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో విజయం సాధించి, 1995 నుండి ఆ స్థానాన్ని దక్కించుకున్న బీజేపీకి పీకే గట్టి దెబ్బ కొట్టి చారిత్రాత్మక ఎన్నికల రంగ ప్రవేశం చేశారు. బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో  64,151 ఓట్లు సాధించి, ఆయన బీజేపీకి చెందిన నీరజ్ కుమార్‌ను 19,324 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ... చరిత్ర సృష్టించిన బాంకీపూర్ ప్రజలకు అభినందనలు తెలిపారు.