17 August, 2026 | 12:06 PM

పుట్టల వద్ద పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్న మహిళలు

17-08-2026 11:34 AM

బోథ్, ఆగస్టు 17 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మహిళలు నాగ పంచమిని పురస్కరించుకుని పురస్కరించుకొనిపుట్టలవద్ద సోమవారం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా పుట్టలకు పూజలు చేసి పాలు పోసి మొక్కులు చెల్లించారు. స్థానిక విశ్రాంతి భవనం వద్ద ఉన్న పుట్ట వద్ద పూజలు చేసేందుకు భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలను చేపట్టారు..