10 July, 2026 | 3:16 PM

వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఫ్రైడే డ్రైడే

10-07-2026 02:42 PM

* జిల్లా ప్రోగ్రామీ ఆఫీసర్ డాక్టర్ నవ్య

పాపన్నపేట: దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రోగ్రామి ఆఫీసర్ డాక్టర్ నవ్య పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నార్సింగి గ్రామాల్లో డ్రైడే కార్యక్రమం నిర్వహించి నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వాను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగిస్తున్నామన్నారు.

దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజలు సైతం ఎక్కడ నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ధారబోయిన మల్లేశం, వైద్య సిబ్బంది చందర్, రాజశ్రీ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.