10 July, 2026 | 3:32 PM

ఇథనాల్ వ్యర్థ జలాలు నిలిపివేయాలి

10-07-2026 02:53 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి శుద్ధి చేయని వ్యర్థ జలాల విడుదలతో రైతులు, పశువులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గొల్లకుంట–వొర్రె దాచారం శివారులో వ్యర్థ జలాలు ప్రవహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

వ్యర్థ జలాల వల్ల వ్యవసాయ భూములు కలుషితమవడంతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందన్నారు. అధికారులు వెంటనే స్పందించి వ్యర్థ జలాల విడుదలను నిలిపివేసి శాశ్వత పరిష్కారం చూపాలని, లేకుంటే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోలిపాక రాజు, గుగ్గిళ్ళ సర్పంచ్  గుగ్గిళ్ళ మల్లయ్య, మలేషం గౌడ్,మండల  నాయకులు బోయినపల్లి అనిల్ రావు,సంగా రవి, భామండ్ల జ్యోతి ,గజే శ్రీను  తదితరులు పాల్గొన్నారు.