13 April, 2026 | 4:29 PM

Breaking News

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •  

ల్యాండ్ మార్క్‌గా గద్దర్ కల్చరల్ సెంటర్

01-02-2026 01:52 AM
  1. ఆయన సేవలు భావితరాలకు తెలిసేలా చేస్తాం
  2. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 
  3. ప్రజలు చెక్కిన శిల్పం గద్దర్ 
  4. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ 
  5. సీతక్కను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించాలి
  6. ఆదివాసీల హక్కులను కాపాడుకోవాలి 
  7. రవీంద్ర భారతిలో ఘనంగా ప్రజా యుద్ధనౌక 78వ జయంతి వేడుకలు

ముషీరాబాద్, జనవరి 31(విజయక్రాంతి): గద్దర్ సేవలు భావితరాలకు తెలిసే లా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూరి లక్ష్మణ్ అన్నారు. గద్దర్ కల్చరల్ సెంటర్‌ను ముఖ్యమంత్రితో మాట్లాడి హైద రాబాద్‌లో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచేలా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ 78వ జయంతి ఉత్సవాలు శనివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.

ఈ ఉత్స వాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, మాజీ ఎంపీ మధుయాష్కీ, ప్రొఫెసర్లు హరగోపాల్, ఖాసీం, సంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, గద్దర్ తనయుడు సూర్యం తదితరులు పాల్గొని గద్దర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో అప్పులు చేసి, ఖాజానా ఖాళీ చేసిందని, అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు ఉద్యోగాల భర్తీ చేస్తున్నా మన్నారు. ప్రజలు చెక్కిన శిల్పం గద్దర్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ అన్నారు. గద్దర్ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు. భవిష్యత్ తరాలు ఉద్యమం చేయడానికి గద్దర్ చరిత్ర స్ఫూర్తిని తెలిపారు.

13వ శతాబ్దంలో సమ్మక్క సారక్క విప్లవకారులు అని.. వాళ్లు పాలక వర్గాలపై పోరాటం చేసారని చెప్పారు. సీతక్కను సమ్మక్క సారలక్కల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించాలని, ఆదివాసీల హక్కులను కాపాడుకో వాలని ఆయన అన్నారు. తమలాంటి జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తి గద్దర్ అని ఎమ్మెల్సీ బండా ప్రకాష్ అన్నారు.

ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కల్చర్, రీసెర్చ్ సెంటర్స్ కోసం 10 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరారు. అంతకముందు కళాకారులు గద్దర్ ఆలపించిన పాటలను పాడి, ఆడి వీక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నర్సింహా రెడ్డి, ప్రొఫెసర్ శాంత సిన్హా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల, కళాకారులు నల్గొండ గద్దర్, సోమన్న , పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా గొంతుక గద్దర్: సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ప్రజా యుద్ధనౌక, తెలంగాణ పోరాట యోధుడు గద్దర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. అణిచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపర్చిన పోరాట వీరుడని సీఎం స్మరించుకున్నారు. సమా జంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గొంతుక గద్దర్ అని సీఎం కొనియాడారు.

గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆయన పేరుతో అవార్డును నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులకు, సినీ ప్ర ముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. గద్దర్ పాటలు, ఆలోచనలు, పోరాట స్ఫూర్తి ప్రజల మధ్య శాశ్వతంగా జీవిస్తాయని పేర్కొన్నారు.