calender_icon.png 1 February, 2026 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవును రాజ్యమాతగా ప్రకటించాలి

01-02-2026 02:12:06 AM

  1. గోమాంస ఎగుమతులను నిషేధించాలి
  2. నేపాల్, మహారాష్ట్ర తరహాలో ఆవుకు అధికారిక హోదా ఇవ్వాలి 
  3. సీఎం యోగి ‘హిందుత్వ’ రుజువుకు సమయం ఆసన్నం
  4. స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి 

లక్నో, జనవరి 31: ఉత్తరప్రదేశ్‌లో గోవు ను ‘రాజ్యమాత’గా ప్రకటించాలని, అదే సమయంలో రాష్ట్రంలో గోమాంస ఎగుమతులను పూర్తిగా నిషేధించాలని శంకరాచా ర్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి డిమాండ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతియుతంగా జరుగుతున్న గో సంరక్షణ ఉద్య మాన్ని యోగి ప్రభుత్వం అణచివేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వెంటనే మహా రాష్ట్ర, నేపాల్ తరహాలో ఉత్తర్ ప్రదేశ్‌లోనూ ఆవు ను ‘రాజ్యమాత’గా ప్రకటించడంతో పాటు, రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న గోమాంసాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల న్నారు.

ఇందుకు యోగి ప్రభుత్వాని కి 40 రోజులు గడువు ఇస్తున్నామని, ఈలోగా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే పరిణామా లు తీవ్రంగా ఉంటాయని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి హెచ్చరించారు. ఈ సం దర్భంగా 1966లో ఢిల్లీలో జరిగిన గోసంరక్షణ ఉద్యమాన్ని స్వామి అవిముక్తేశ్వరానంద గుర్తు చేసుకున్నారు. ఆనాడు శాంతియుతంగా జరుగుతున్న గోసంరక్షణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పోలీసులు కాల్పు లు జరిపారని, ఈ కాల్పుల్లో సనాతన ధర్మ సామ్రాట్ స్వామి కర్పాత్రి మహారాజ్ సహా సనాతన నాయకులు, భక్తులు మరణించారని పేర్కొన్నారు.

గోరక్షణ, గోవధ నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలనే డిమాండ్లు లేవనెత్తడమే ఆనాడు ప్రభుత్వానికి తప్పుగా కనిపించిందని, అందుకే వారు పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయ త్నం చేశారని తెలిపారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోనూ గో సంరక్షణ ఉద్యమానికి సంబంధించి ఈ తరహా అణచివేతే జరుగుతుందని, తమ ప్రతినిధులు, గోరక్షణ మద్ద తుదారులు ప్రభుత్వం నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. 

ఇదంతా యోగి ఆదిత్యనా థ్ పర్యవేక్షణలోనే జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందని స్వామి అవిముక్తేశ్వరానంద వెల్లడించారు. కాగా దీనిపై యోగి ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తాను హిందువుగా రుజువు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు. 

యూపీదే అత్యధిక వాటా

మరోవైపు దేశంలో గోమాంసం ఎగుమతుల్లో ఉత్తర్ ప్రదేశ్ అత్యధిక వాటా కలిగి ఉం డడం బాధాకరమని స్వామి అవిముక్తేశ్వరానంద వెల్లడించారు. దేశంలో దాదాపు 40 శాతం గోమాంసం ఎగుమతులు ఉత్తర ప్రదేశ్ నుంచే జరుగుతుందని, తక్షణమే గోమాంస ఎగుమతులను నిషేధించాలని డిమాండ్ చేశారు.

గోవుల పరిరక్షణ, సనాత న ధర్మాన్ని కాపాడటమే తమ ముఖ్య ఉద్దేశమని, అందుకోసం ఎంతవరకైనా వెళతా మని హెచ్చరించారు. ఇప్పటికే గోవును ‘రాజ్యమాత’గా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. కాగా సెప్టెంబర్ 2024లో అప్పటి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం దేశీ ఆవులను ‘రాజ్యమాత’గా ప్రకటించినట్లు గుర్తు చేశారు. 

యూపీ సర్కార్‌కు అల్టిమేటం

తమ డిమాండ్లపై 40 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి యోగి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 40 రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మార్చి 10, 11వ తేదీల్లో లక్నోలో సాధువులతో పెద్ద ఎత్తున బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ‘నకిలీ హిందువు’గా ప్రచారం చేయా ల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఈ అంశాన్ని ప్రజలు ఒక వ్యక్తిగత ఘర్షణగా కాకుండా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.