2 June, 2026 | 1:16 AM

ఐఐటీ లక్ష్యానికి చేరువైన గాజుల వివేక్

02-06-2026 12:35 AM

జాతీయ స్థాయిలో సత్తా చాటిన హన్మాజీపేట యువకుడు వివేక్

వేములవాడ, జూన్ 1,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ మండలం, హన్మాజీపేట గ్రామానికి చెందిన గాజుల వివేక్ ప్రతిష్ఠాత్మక జేఈఈ అడ్వానస్డ్2026 పరీక్షలో ఆల్ ఇండియా 850వ ర్యాంక్ సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. ఓబీసీ విభాగంలో 136వ ర్యాంక్ దక్కించుకున్నాడు.

ఇప్పటికే జేఈఈ మెయిన్లో 99.84 శాతం సాధించిన వివేక్, అడ్వాన్స్డో్ల నూ అద్భుత ప్రతిభ కనబరిచి ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశానికి అవకాశాలు మెరుగుపరుచుకున్నాడు. పదో తరగతిలో 97.5 శాతం, ఇంటర్మీడియట్లో 99 శాతం మార్కులు సాధించిన ఆయన ఈఏపీసెట్లో కూడా 138వ ర్యాంక్ పొందాడు. తల్లిదండ్రులు గాజుల శ్రీనివాస్ - లావణ్య ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం తన విజయానికి కారణమని వివేక్ తెలిపాడు. భవిష్యత్తులో సాంకేతిక రంగంలో రాణించి దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.