కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు: మాజీ ఎమ్మెల్యే గండ్ర

28-09-2026 | 06:03pm

ది ప్యారడైజ్ చిత్రాన్ని వీక్షించిన గండ్ర

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కేసీఆర్ ఫామ్ హౌసులో కాదు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఆనంద్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ది ప్యారడైజ్ సినిమాను గండ్ర సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు.

సినిమాలో కేసీఆర్ పాత్ర తెరపై కనిపించిన సమయంలో ఆయా షేర్ అంటూ ప్రేక్షకులు, అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కేసీఆర్ పాత్ర తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూస్తే ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అనుబంధం, అభిమానం, ఈ మూడేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలకు ఏర్పడ్డ అవిశ్వాసం మరోసారి స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు