10 March, 2026 | 8:07 AM

వైభవంగా ప్రారంభమైన ‘గన్ గోర్’ పూజలు

09-03-2026 10:54 AM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని హనుమాన్ మందిరంలో(Hanuman Temple) మార్వాడి సమాజం ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే ‘గన్ గోర్’ (గౌరీ దేవి)(Gangaur puja) పూజలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గౌరీ దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గౌరీ దేవికి పుష్పాలు, పండ్లు సమర్పించి మహిళలు సంప్రదాయ వేషధారణలో భక్తిగీతాలు పాడుతూ పూజల్లో పాల్గొన్నారు.

కుటుంబ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని దేవిని ప్రార్థించారు.మార్వాడి సమాజం ప్రతినిధులు మాట్లాడుతూ ఈ పూజలను 16 రోజులపాటు ప్రతిరోజు ఉదయం నిర్వహిస్తామని తెలిపారు. గౌరీ దేవి పూజలు దాంపత్య జీవితం సుఖసంతోషాలతో ఉండాలని, కుటుంబాలలో ఐక్యత, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తూ నిర్వహిస్తారని చెప్పారు.పూజల చివరి రోజున గౌరీ దేవి విగ్రహాలతో వైభవంగా శోభాయాత్ర నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక కార్యక్రమాలతో ముగింపు జరుపుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్వాడి సమాజానికి చెందిన మహిళలు, పెద్దలు, యువతులు భక్తి భావంతో పాల్గొని పూజలు చేశారు.


ఇవి కూడా చదవండి:

యూరియా బస్తా రూ. 300కు అమ్ముతున్నారు

చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఓపెనింగ్

చెడిపోయిన చేతి పంపుకు మరమ్మత్తులు చేయండి సారు