15 May, 2026 | 8:36 PM

Breaking News

యువతి యువకులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!   •   అక్రమ ఇసుక లారీ పట్టివేత   •   వరి ధాన్యం నిల్వ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు   •   డివైడర్ పై ప్రమాదకరంగా ఫ్లెక్సీలు   •   తెలంగాణ మోడల్ స్కూల్‌లో పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం   •   బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి   •   సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి   •   బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •  

ఢిల్లీలో గ్యాంగ్‌వార్

21-10-2024 12:00 AM
  1. 10 రౌండ్ల కాల్పులు
  2. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పురిలో రెండు వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ తలెత్తింది. ఇది ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకునే వరకు వెళ్లింది. ఇందులో దీపక్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీపక్ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయినట్లు పోలీసులు వెల్లడించారు. నరేంద్ర, దీపక్ అనే మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. దీపక్, అతని సోదరుడితో పాటు మరికొంత మంది స్నేహితులు ఓ పార్కు వద్ద ఉండగా నరేంద్ర, సూరజ్ అక్కడి వచ్చారు. వీరి మధ్య వ్యక్తిగత విషయంలో గొడవ తలెత్తగా కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేంద్ర, దీపక్‌ను అరెస్టు చేశారు. మిగిలినవారు పరారీలో ఉన్నారు.