27 July, 2026 | 7:47 PM

Breaking News

దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •   ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ మంజూరు చరిత్రాత్మకం   •  

అశ్వాపురంలో గంజాయి పట్టివేత

27-07-2026 07:15 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలోని సీతారామ కెనాల్‌ వద్ద ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం నిర్వహించిన తనిఖీల్లో ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న 4.760 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుమానాస్పదంగా వస్తున్న హీరో గ్లామర్‌ ద్విచక్ర వాహనం (AP 24 AS 6802)ను తనిఖీ చేయగా గంజాయి లభించింది. గంజాయిని కలిమెల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న నల్గొండ జిల్లా హనుమాన్‌నగర్‌కు చెందిన జాల సందీప్‌, ఓ మైనర్‌ పట్టుబడ్డారు.

గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ కలిపి మొత్తం విలువ రూ.2.96 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, సెల్‌ఫోన్‌ను తదుపరి విచారణ నిమిత్తం మణుగూరు ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించారు. డిప్యూటీ కమిషనర్‌ వి. సోమిరెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌. కిషన్‌ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ సీహెచ్‌. శ్రీహరిరావు ఆధ్వర్యంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఖలీల్‌ అహ్మద్‌, కానిస్టేబుళ్లు వీరబాబు, ప్రసన్నకుమార్‌, తిరుపతి, ఉపేందర్‌ తనిఖీల్లో పాల్గొన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే 18004252523 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.