27 July, 2026 | 7:49 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్

27-07-2026 07:18 PM

నిమ్మగడ్డ రవికుమార్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.11,000 అందజేత

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని సిద్ధారం రోడ్డులో నివాసం ఉంటున్న టూ వీలర్ మెకానిక్ నిమ్మగడ్డ రవికుమార్ ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టూ వీలర్ మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.11,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ యూనియన్ సభ్యులు తమ సంఘీభావాన్ని తెలిపారు.