17 July, 2026 | 12:26 AM

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితిరాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంట సుదర్శన్

17-07-2026 12:00 AM

ఎల్బీనగర్, జులై 16 : తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా గంట సుదర్శన్ నియమితులయ్యారు. ఈ మేరకు గంట సుదర్శన్ కు బుధవారం  తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్ సన్, ప్రధాన కార్యదర్శి పిండిగ వెంకన్న చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న గంట సుదర్శన్ ఉద్యమ కారుల సంక్షేమం కోసం భవిష్యత్తులో పని చేస్తారని ఆశిస్తూ ఈ నియామకం చేయడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్ సన్ పేర్కొన్నారు.

రాష్ట్ర సాధనలో రాజీలేని పోరాటం చేసిన గంట సుదర్శన్ తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమం హక్కుల కోసం క్రియాశీలకంగా పాల్గొంటారని ఆయన తెలిపారు.తెలంగాణ కోసం 2001 నుంచి సుదర్శన్ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని రాష్ట్ర ప్రధాన పిండిగ వెంకన్న అలియాస్ తెలంగాణ వెంకన్న అన్నారు.

  రాజకీయాలకు అతీతంగా ఉద్యమ కారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన  స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర నాయకులు బి.జాన్, నాయకులు ఇరుగు కిరణ్, కొమ్ము రాజశేఖర్, ఇరుగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.