పోరాటాలు తీవ్రం చేస్తేనే సమస్యల పరిష్కారం
ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వి.ఎస్.బోస్
ముషీరాబాద్, జూలై 16(విజయక్రాంతి): ఆటో డ్రైవర్లు తమ సమస్యల పరిస్కారం కోసం పోరాటాలు తివ్రతరం చేయాలని ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వి.ఎస్.బోస్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ లో గురువారం తెలంగాణ రాష్ట్ర ఆటో, ప్రైవేట్ మోటార్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి సమావేశం యూనియన్ అధ్యక్షులు కె. జమలయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి వి.ఎస్.బోస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు గత 14 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం దుర్మార్గమన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు తక్షణమే ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, సంవత్సరానికి12 వేల ఆర్థిక సహాయం అందించడంతోపాటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఇందులో భాగంగా జూలై 28 న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నామని బి. వెంకటేశం వెల్లడించారు. ఈ సమావేశంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి. ఇమ్రాన్, నాయకులు కమతం యాదగిరి, సిహెచ్. జంగయ్య, చందు యాదవ్, కృష్ణమూర్తి, శ్యామల భాస్కర్, ఎ.బిక్షపతి యాదవ్, ఎస్. అశోక్, ఎం. కృష్ణ, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు.






