పెండింగ్ వేతనాలు చెల్లించాలి

16-09-2026 | 09:08pm

మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె.. నిలిచిన చెత్త సేకరణ

కల్లూరు, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): పెండింగ్ వేతనాలు(Pending wages) తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కల్లూరు మున్సిపాలిటీ కార్మికులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో పలు వార్డుల్లో చెత్త సేకరణ నిలిచిపోవడంతో రోడ్లపై చెత్త నిలిచిపోయింది. దీంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు తెలిపారు.

గతంలోనూ ఇదే సమస్యపై నిరవధిక సమ్మె చేపట్టగా అధికారులు, పాలకవర్గం హామీ ఇవ్వడంతో విరమించామని, హామీలు అమలు కాకపోవడంతో మరోసారి సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. వేతనాలు చెల్లించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సింగ్ నరసింహారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, అధ్యక్షుడు శివరామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో బీకేఎంయూ జిల్లా నాయకులు దండు ఆదినారాయణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేము రాంబాబు, సీపీఐ మండల కన్వీనర్ కొత్తపల్లి వెంకటనారాయణ, మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఓడల కృష్ణమూర్తి, కార్యదర్శి వజుర్మియా, ఖమ్మంపాటి ప్రకాష్, చింతపల్లి శ్రీను,యశోద,చిన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు