6 June, 2026 | 1:41 AM

ఎన్‌ఎంఎంఎస్‌లో ప్రతిభ చూపిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు

06-06-2026 12:00 AM

సుల్తానాబాద్, జూన్ 5 (విజయక్రాంతి):  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్ స్కూల్  విద్యార్థులు ప్రతిభ కనబరచారు. ఇటీవల వెలువడిన ఎన్‌ఎంఎంఎస్‌లో  8వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఎనగందుల శ్రీవిద్య , పోతుగంటి సాయి వర్షిత , కుర్మా వెంకట్ ఋషి , ఎండి ఇర్ఫాన్ లను టీజీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ డా.గోల్డీ బల్బీర్ కౌర్  అభినందించారు.వీరికి సంవత్సరానికి 12 వేల రుపాయల చొప్పున 4 సంవత్సరాల వరకు 48,000/- రూపాయలు స్కాలర్ షిప్  రూపంలో అందజేయడంజరుగుతుందని శుక్రవారం  తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.