శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం
12-06-2026 04:52 PM
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యా సంవత్సర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం గాయత్రి హోమం ఘనంగా నిర్వహించారు. శ్రీ జంబోజు తిరుపతి పూజారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భావండ్లపల్లి శ్యాం ల, స్వప్న దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి నాగుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కొడిపాక వేణుగోపాల్, సహాయ కార్యదర్శి కల్లూరి సంతోష్, సభ్యులు చిప్ప రమాదేవి, కల్లూరి వైష్ణవి, కాండ్రే దుర్గా, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు,ఆచార్యులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.






