వ్యాధుల నివారణపై దృష్టి సారించండి
బోథ్,(విజయక్రాంతి): వ్యాధులు ప్రబలితే వాటి నివారణ పైన దృష్టి సారించాలని పార్టీ (కె )గ్రామ సర్పంచ్. చౌహన్ వినోద్ పేర్కొన్నారు శుక్రవారం కొల్లాపూర్ గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా టిబి విముక్తి భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... వ్యాధి సోకిన వెంటనే నివారణ పైన దృష్టి సారించాలన్నారు.. వైద్యుల సూచనలు పాటించి వ్యాధి నయం అయ్యేంతవరకు మందులు వాడాలన్నారు.
కార్యక్రమంలో డీటీసీఓ డాక్టర్ సుమలత మాట్లాడుతూ టీబీ వ్యాధి నివారణ పైన ప్రభుత్వం ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు టీబీ వ్యాధి పోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. యాదిగ్రస్తులు డాక్టర్ల సలహాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అశోక్ గ్రామ పెద్దలు నగేష్ దత్తు హెల్త్ సూపర్వైజర్ ఉత్తమ్ ఏఎన్ఎం ఉష గోవింద్ ఆశ వర్కర్లు ప్రేమల జాన బాబు రాధా గ్రామ ప్రజలు పాల్గొన్నారు






