12 June, 2026 | 6:07 PM

చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు

12-06-2026 04:50 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని చిన్న బెండరా గ్రామంలో మాలి సంక్షేమ సంఘం నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. చేసినట్లు వాంకిడి మండల అధ్యక్షుడు వడై బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్న బెండరా గ్రామ అధ్యక్షుడిగా బెండారే వినేష్, ఉపాధ్యక్షుడిగా నీకురే సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా మొహుర్లే సతీష్, కోశాధికారిగా టాక్రీ లక్ష్మణ్, ప్రచార కార్యదర్శిగా మొహుర్లే శంకర్,

సంయుక్త కార్యదర్శిగా మహండోరే మారుతిలు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురునూలే నారాయణ, జిల్లా అధ్యక్షుడు సెండే వాసు, డివిజన్ అధ్యక్షుడు గురునూలే మెంగజి, మండల ప్రధాన కార్యదర్శి వడై జ్యోతిబా, మండల ప్రచార కార్యదర్శి సెండే సుధాకర్ హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. గ్రామ పెద్దలు, యువకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. నూతన కమిటీ సమాజ సంక్షేమం కోసం కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.