అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ ఫోకస్
04-09-2026 | 06:12pm
హైదరాబాద్ సెప్టెంబర్4(విజయక్రాంతి): ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం(BRS Legislature Party Meeting) జరగనుంది. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల(Assembly meetings) నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్షానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ(Assembly)లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలను లేవనెత్తే అంశాలపై నేతలతో చర్చించే అవకాశం ఉంది.






