సొసైటీలో సర్వసభ్య సమావేశం

28-09-2026 | 02:28pm

జుక్కల్, సెప్టెంబర్ 28(విజయ క్రాంతి): జుక్కల్‌ సొసైటీ(Jukkal Society) కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సొసైటీకి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో సభ్యులతో చర్చించారు.సొసైటీ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై వివరాలను సభ్యులకు చదివి వినిపించారు. గత ఆరు నెలల్లో సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన పంటలు, ఇతర అంశాల ద్వారా వచ్చిన లాభాల వివరాలను సమావేశంలో వెల్లడించారు.

సొసైటీ కార్యకలాపాలకు సంబంధించి సభ్యులు, ప్రజాప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు నిర్వాహకులు సమాధానాలు ఇచ్చారు. అలాగే సొసైటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు. సభ్యుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సొసైటీ నిర్వాహకులు పేర్కొన్నారు. సమావేశానికి సభ్యులు, ప్రజాప్రతినిధులు, సొసైటీ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. సమావేశంలో చైర్మన్ శివానంద్, సాయిగౌడ్, సాయిగౌడ్ రాములు, గంగు నాయక్, గణేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు