టీచర్ బదిలీతో చదువులకు బ్రేక్?

28-09-2026 | 03:17pm

పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన పరిస్థితి

బేల సెప్టెంబర్ 28(విజయక్రాంతి): బెల అశోక్ నగర్ కాలనీ స్థానిక MPPS పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలి బదిలీ(teacher)ని నిలిపివేసి, విద్యార్థుల విద్యకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉపాధ్యాయురాలి బదిలీతో తమ పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: లడ్డూ వేలంలో అదిరిపోయే ధర

బదిలీని నిలిపివేసి పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పాఠశాలకు తాళం వేసి నిరసన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన పరిస్థితి వస్తుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు