లడ్డూ వేలంలో అదిరిపోయే ధర

28-09-2026 | 03:11pm

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Cyberabad Municipal Corporation) పరిధిలోని మేడ్చల్ సర్కిల్ కండ్లకోయలో రాయల్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం(Ganesh Laddu Auction) పాటలో కండ్లకోయ గ్రామ మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి కుమారుడు కందాడి జీవన్ రెడ్డి రూ.1,05,000కు లడ్డూను దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి: ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం ఏది?

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వినాయక నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న స్వామివారి లడ్డూను తన కుమారుడు వేలంలో సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. వినాయకుడి ఆశీస్సులతో డివిజన్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

అనంతరం రాయల్స్ యూత్ క్లబ్ అధ్యక్షుడు బాబు ముదిరాజ్‌తో పాటు అల్లివేను ముదిరాజ్, కిషోర్, సీహెచ్ పవన్ ముదిరాజ్, సుధీర్, చింటూ తదితరులు లడ్డూను దక్కించుకున్న కందాడి జీవన్ రెడ్డిని శాలువాలతో సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమానికి గుండ్లపోచంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు అమరం హేమంత్ రెడ్డి, సముద్రాల హంస రాణి కృష్ణ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు సముద్రాల కృష్ణ గౌడ్, నాయకులు ఎస్. రాజేందర్ ముదిరాజ్, కే. శ్రీకాంత్ రెడ్డి, దీపక్ కుమార్, ఎస్. భాస్కర్, ఎస్. కిషోర్‌తో పాటు పట్టణవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు